TG : కబ్జా కనిపిస్తే వాట్సప్ చేయండి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక హైడ్రా రంగంలోకి దిగింది. ప్రభుత్వ భూముల పరిరక్షణపై కార్యాచరణ మొదలు పెట్టింది. అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో అక్రమాలు పెరిగాయి. ప్రభుత్వ స్థలాలు కనిపించకుండా పోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
నగరం చుట్టూ ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఎవరైనా సర్కారు భూములను ఆక్రమిస్తే తక్షణం ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. భూ ఆక్రమణలకు సమాచారాన్ని తమకు తెలియజేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
ఆక్రమణల వివరాలు టోల్ ఫ్రీ నెంబర్ 18005990099, కంట్రోల్ రూమ్ 04029560509, 04029560596, 040 29565758, 04029560953 సమాచారమివ్వాలని రంగనాథ్ కోరారు. వివరాలను హైడ్రా అధికారిక మెయిల్ ఐడీకి మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆక్రమణల సమాచారం నేరుగా కమిషనర్ ను కలిసి వివరించాలనుకుంటే ముందుగా 7207923085 నెంబర్ కు మేసేజ్ పంపించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com