Minister Uttam : సన్నబియ్యం పంపిణీకి స్పందన అద్భుతం: మంత్రి ఉత్తమ్

సన్నబియ్యం పంపిణీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో 2.8కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇచ్చేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేశారని, తాము 3.10కోట్ల మందికి సన్నబియ్యం ఇవ్వడానికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పండని పంట కాంగ్రెస్ హయాంలో పడిందని, తమది రైతు పక్షపాత ప్రభుత్వమనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
అకాల వర్షాలతో రాష్ట్రంలో పలు చోట్ల ధాన్యం తడిసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని, తరుగు తీస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ మంచి పథకమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com