TG : మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై ఆంక్షలు

TG : మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై ఆంక్షలు
X

మూసీ నది పరిసరాలు, పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. మూసీ పరిసరాల్లో నిర్మాణాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందుకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. మూసీ పరిసరాల్లో ప్రణాళిక రహిత అభివృద్ధి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డీటీసీపీ, జీహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ తో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేఎండీకి కూడా కమిటీలో చోటు దక్కింది.

మూసీ నదికి 50 మీటర్ల వరకు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులను జారీ చేసింది. మూసికి 50 నుంచి 100 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలకు కొత్తగా అను మతులు మంజూరు చేయవద్దని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. మూసీ పునరుజ్జీవం మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు నిర్మాణాలకు సంబంధించి ఎటు వంటి కొత్త అనుమతులు ఇవ్వొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిటీ అనుమతి మం జూరు చేసే వరకు కొత్త అనుమతులు ఇవ్వొద్దంది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. మూసీ పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Tags

Next Story