Kaleswaram : నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం

Kaleswaram : నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం
X

నేటి నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగనుంది. రెండు విడతల్లో కొనసాగనున్న బహిరంగ విచారణలో పలువురు ఇంజనీర్లను, రిటైర్డు ఇంజనీర్లను, ఉన్నతాధికారులను విచారణకు పిలువాలని అధికారులను కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తో విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్ రిపోర్ట్‌పై జస్టిస్ చంద్రఘోస్‌కు వివరణ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్ డీజీకి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. అందులో భాగంగానే కమిషన్‌తో కొత్త కోట టీమ్ భేటీ అయింది. గత డీజీ సీవీ ఆనంద్ సైతం కమిషన్‌తో ఒకసారి సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తామని విజిలెన్స్ డీజీ కొత్త కొట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

కమిషన్ ముందుకు వారు కూడా...

ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోక్రాట్ల విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉందని సమాచారం. ఇప్పటికే విచారణ చేసిన ఇంజనీర్లలోనూ పలువురుని మళ్ళీ కమిషన్ ప్రశ్నించనుంది. ఈ నెల 29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నేత వి.ప్రకాష్‌కు ఈ వారంలోనే బహిరంగ విచారణకు పిలువనుంది. ఈ నెలాఖరులోగా ఎన్డీఎస్ఏ, విజిలెన్స్‌లు తమ ఫైనల్ రిపోర్టులను కమిషన్ కు అందించనున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. ఈసారి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, అకౌంట్స్ ప్రతినిధులను సైతం కమిషన్ ముందుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చివరగా ప్రజా ప్రతినిధులను బహిరంగ విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయం తీసుకుంది.

Tags

Next Story