Bandi Sanjay : రేవంత్, కేటీఆర్ మంచి ఫ్రెండ్స్ : బండి సంజయ్

మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది సీఎం రేవంత్ రెడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు బండి ఓ ప్రకటన విడుదల చేశారు. 'రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచు కుంటున్నరు. చెన్నై డీలిమిటేషన్ మీటింగ్ కు వారిద్దరూ కలిసే వెళ్లారు. హైదరాబాద్ లో త్వరలో జరగబోయే మీటింగ్ ను ప్లాన్ చేస్తు న్నరు. ఆ ఇద్దరూ కలిసే వర్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటేయించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ను గెలిపించేం దుకు సిద్దమయ్యారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ ను కాపాడేందుకేకేటీఆర్ బీఆర్ఎస్ ను బరిలో దించలేదు. ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ధి మారలేదు. ఇద్దరూ ఏకమై బీజేపీని దెబ్బతీ సేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నరు. హెచ్ సీయూ భూములపై దమ్ముంటే సీబీఐ విచార ణకు సిద్ధమా? భూదందా, అవినీతిపరులపై ఉక్కుపాదం మోపే మోదీ సర్కార్ కేంద్రంలో కొనసాగుతోంది' అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com