MLC Kavitha : రేవంత్ ప్రభుత్వ నిర్ణయం.. ఎమ్మెల్సీ కవిత హర్షం

తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కేబినెట్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ వైఖరిని ప్రశంసించారు. ఈ నిర్ణయం తెలంగాణలోని బీసీల విజయమని కవిత అభివర్ణించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ జాగృతి సంస్థ మొదటి నుంచి బలంగా డిమాండ్ చేస్తోందన్నారు. కేబినెట్ తాజా నిర్ణయం తమ పోరాటానికి దక్కిన విజయమన్నారు. ఈ సందర్భంగా కవిత జై బీసీ, జై జాగృతి అనే నినాదాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com