TG : 18 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

TG : 18 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
X

మేఘా ఇంజినీరింగ్ సంస్థకు లబ్ధి చేసేందుకే ఏపీలో బనక చర్ల ప్రాజెక్టును నిర్మిస్తు న్నారని, రేవంత్ రెడ్డి, బాబు భేటీ అయిన తర్వాతే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. బాబుకు వ్య తిరేకంగా మాట్లాడేందుకు భయపడే రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారని అన్నారు. బాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన 18 నెలల పరిపాలన కాలంలో 2 లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారని విమర్శించారు. అయినా మహిళలకు మహా లక్ష్మి పథకం కింద రూ. 2,500 ఇవ్వడం లేదన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మెగా, పొంగులేటి కంపెనీలు దక్కించుకున్నాయన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరి గేషన్ పనులు ప్రారంభం కాకముందే కంపెనీ లకు అడ్వాన్స్ లు ఇచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నామ ని కవిత చెప్పారు. రేవంత్ అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో బుక్ లెట్లు రెడీ చేసి రాష్ట్ర వ్యాప్తం గా పంచుతామని అన్నారు. రూ. 2 లక్షల కోట్ల అప్పులపై సీఎం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం రాముడు మును గుతున్నా తెలంగాణలో ఉన్న 8మంది బీజేపీ ఎంపీలు నోరెత్తడంలేదని విమర్శించారు. భద్రాచలం దగ్గర ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని అన్నారు.

Tags

Next Story