Revanth Invites KCR : ప్రజాపాలన విజయోత్సవాలకు కేసీఆర్‌కు రేవంత్ ఆహ్వానం

X
By - Manikanta |6 Dec 2024 3:30 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కేసీఆర్‌ను పిలవాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ నెల 9న సెక్రటేరియట్‌లో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహ్వానం పంపనుంది. మంత్రి పొన్నం స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించనున్నారు. ఐతే.. కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com