TG : రేవంత్ విలక్షణ నాయకుడు పోరాట యోధుడు.. పీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్

TG : రేవంత్ విలక్షణ నాయకుడు పోరాట యోధుడు.. పీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్
X

తెలంగాణ రాజకీయాల్లో విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బందాలతో పాలన చేస్తున్న కేసీఆర్ పైన పోరాటం చేసిన యోధుడిగా రేవంత్ రెడ్డిని కీర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి, విజయార్కే రచించిన ఒకే ఒక్కడు పుస్తకాన్ని గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ విడుదల చేశారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి నుంచి రేవంత్ రెడ్డికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Next Story