KTR : గిగ్ వర్కర్లను రేవంత్ నట్టేట ముంచిండు - కేటీఆర్

KTR : గిగ్ వర్కర్లను రేవంత్ నట్టేట ముంచిండు - కేటీఆర్
X

ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం రేవంత్.. గద్దెనెక్కాక ఉన్న పథకాన్ని కూడా ఊడగొట్టాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేవలం 20 నెలల్లోనే అన్ని వర్గాలను వంచించిన దగాకోరు రేవంత్ అని మండిపడ్డారు. మానవీయ కోణంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన డ్రైవర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకానికి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొట్టి, కాంగ్రెస్ సర్కార్ బంద్ పెట్టిందన్నారు.

2024 అక్టోబర్ నుంచి పథకాన్ని ఆపేసి.. ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్ల కుటుంబాలను రేవంత్ రోడ్డున పడేశాడని కేటీఆర్ ఆరోపించారు. రైతు బీమా, నేతన్నకు బీమా, డ్రైవర్లకు బీమా వంటి ఎన్నో పథకాలతో ప్రజల భవిష్యత్తుకు కేసీఆర్ ధీమా అందిస్తే.. రేవంత్ ఒక్కో పథకానికి మంగళం పాడారని విమర్శించారు. రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే సెటిల్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags

Next Story