Harish Rao : రేవంత్.. మాట మార్చడమే మీ విధానమా? : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తాము అధికా రంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ రోడ్డు అలైస్మెంటు ను మారుస్తామన్నారని.. ఇప్పుడేమో మాట మార్చి, నిర్బంధాల మధ్య భూసేకరణ కొన సాగిస్తున్నారని ఫైర్అయ్యారు. రేవంత్ రెడ్డి.. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్ధతా అని నిలదీశారు. హైదరాబాద్లో ట్రిపుల్ ఆర్ బాధితులు, రైతులు హరీశ్ రావును కలిశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల గొంతును వినిపిస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తం' అని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com