CM Revanth Reddy : మోడీ హయాంలో రాజ్యాంగ విచ్ఛిన్నం.. రేవంత్ విసుర్లు

CM Revanth Reddy : మోడీ హయాంలో రాజ్యాంగ విచ్ఛిన్నం.. రేవంత్ విసుర్లు
X

మోడీ పరివార్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక్షణ్ అభియాన్ కార్యక్రమానికి సీఎం రేవత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణకు గాంధీ పరివారం ప్రయత్నం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ వెంటే దేశ ప్రజలు ఉన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ చెబుతున్న కులగణన సమాజానికి ఎక్స్ రే మాత్రమే కాదని..ఇది సమాజం యొక్క మెగా హెల్త్ చెకప్ అన్నారు. కులగణన విషయంలో రాహుల్ గాంధీ పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. రాజ్యాంగ పవిత్రతను కాపాడింది కాంగ్రెస్ పార్టీనే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags

Next Story