Revanth Reddy : చంద్రబాబు సీఎం రేవంత్ ప్రశంసలు.. వైసీపీ ఏమంటుందో..

హైదరాబాద్ మొత్తం సీఎం చంద్రబాబు ఎంత విజనరీ అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిందే కదా. దానికి నిదర్శనమే ఇప్పుడున్న హైదరాబాద్ పట్టణం. అయితే హైదరాబాద్ నిర్మించానని చంద్రబాబు ఎన్నోసార్లు చెబుతున్నా.. దాన్ని ఎక్కువ మంది ఒప్పుకుంటున్నారు. కానీ తెలంగాణలోని కొందరు నేతలు మాత్రం తమ రాజకీయ ఉనికి కోసం దాన్ని అపోజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అదే విషయంపై మాట్లాడారు. హైదరాబాద్ లో ఐటీకి శంకుస్థాపన చేసింది నేదుమల్లి జనార్థన్ రెడ్డి అయినా.. తర్వాత ఆగిపోయింనదన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఐటీని నిర్మించి డెవలప్ చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉందని తెలిపారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఐటీని తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని విమర్శించారని.. కానీ తర్వాత అదే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిందని తెలిపారు.
ఇప్పుడు హైదరాబాద్ లో డెవలప్ మెంట్ వల్లే కోటి ముప్పై లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారంటూ తెలిపారు. నిజమే మరి చంద్రబాబు నాయుడు భవిష్యత్ ను ఊహించి ప్రణాళిక చేస్తారనేది అందరికీ తెలిసిందే కదా. పెట్టుబడుల వ్యూహకర్తగా చంద్రబాబు నాయుడికి ఎంత ఖ్యాతి ఉందో గడిచిన 2025లో కూడా నిరూపితం అయింది. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ దిగ్గజ గూగుల్ డేటా సెంటర్ కూడా ఏపీకే వచ్చింది. టీసీఎస్, క్వాంటమ్, అదానీ డేటా సెంటర్ లాంటివి ఇప్పుడు ఏపీలోనే నిర్మితం అవుతున్నాయి.
ఏపీ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు. కేవలం ఒక దగ్గర డెవలప్ మెంట్ పర్మితం కావొద్దనే ఉద్దేశంతో మూడు ప్రాంతాల్లో సమానంగా కంపెనీలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దాని వల్ల అన్ని జిల్లాలకు సమాంతరమైన పెట్టుబడులు వచ్చి అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ఈ విషయాలను మాత్రం వైసీపీ ఒప్పుకోదు కదా. వాళ్లకు కావాల్సిన అరాచకాలకు అవకాశం లేకుండా ఏపీ అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేక ఎన్నో బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మరిప్పుడు తెలంగాణ సీఎం స్వయంగా చెప్పాడు కాబట్టి దానిపై ఏమంటారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

