Revanth Reddy : చర్చలకు సిద్ధమంటున్న రేవంత్.. బిఆర్ఎస్ ప్లాన్ ఏంటి..?

Revanth Reddy  : చర్చలకు సిద్ధమంటున్న రేవంత్.. బిఆర్ఎస్ ప్లాన్ ఏంటి..?
X

సీఎం రేవంత్ రెడ్డి మరో చర్చకు తెర లేపేందుకు రెడీ అయ్యారు. తన మీద వస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చుకునేలా మరోసారి ప్లాన్ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నిన్న ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాల మీద ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని.. తాను ఏపీకి సహకరించే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలు కల్పించిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా పనిచేయరు అంటూ తెలిపారు. తన మీద చేస్తున్న ఆరోపణలపై అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం అంటూ బిఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తుమ్మడిహేట్టి దగ్గర నుంచి నాగార్జునసాగర్ దాకా గోదావరి జలాలపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో కంప్లీట్ చేస్తామని తెలిపారు.

బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో కంప్లీట్ చేయలేదని.. కేవలం కాలేశ్వరం ప్రాజెక్టును మాత్రమే పట్టించుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి రెండేళ్లుగా ఒక్క టీఎంసీ నీటిని కూడా ఎత్తిపోయకపోయినా.. దేశంలోనే అత్యధిక వారి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని సీఎం వెల్లడించారు. ఈ విషయాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం అన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఓసారి తెలంగాణ నీటి వాటాలపై అసెంబ్లీ వేదికగా చర్చోప చర్చలు జరిగాయి.

ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటి హక్కులపై, గోదావరి నది మీద కట్టిన ప్రాజెక్టులపై చర్చ జరిగితే రాజకీయాలు వేడెక్కడం ఖాయం. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఈలోపే మరో అంశం మీద కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ పోరు మొదలైతే.. రచ్చ మామూలుగా ఉండదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అంశం మీద చర్చించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అదే గనక జరిగితే కేసీఆర్ మరోసారి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు.

Tags

Next Story