తెలంగాణ

Revanth Reddy :ధాన్యం కొనుగోళ్లపై TRS,BJP డ్రామాలు: రేవంత్‌రెడ్డి

Revanth Reddy : ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులు కూడా కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

Revanth Reddy (tv5news.in)
X

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy : ధాన్యం కొనుగోళ్లపై TRS,BJP డ్రామాలాడుతున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులు కూడా కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లోక్‌సభలో వడ్ల కొనుగోళ్లపై TRS ఎంపీలు పట్టుబట్టలేదని, కొందరు సభకే రాలేదని ఆరోపించారు రేవంత్. వడ్లు కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనొద్దు అని ప్రశ్నించారు. పసుపు బోర్డు పేరుతో బీజేపీ...షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేసి TRS నిజామాబాద్ రైతులను మోసం చేసిందన్నారు. ధాన్యం కొనలేనప్పుడు వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం, రైతు బంధు పథకాలు ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయిందన్నారు. కేంద్రం మెడపై కత్తి పెడితే దేనికైనా ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES