Revanth Reddy: టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడం వెనుక కుట్ర: రేవంత్ రెడ్డి

Revanth Reddy: టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడం వెనుక కుట్ర: రేవంత్ రెడ్డి
X
Revanth Reddy: తెలంగాణతో సీఎం కేసీఆర్‌కు ఉన్న పేగుబంధం తెగిపోయిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Revanth Reddy: తెలంగాణతో సీఎం కేసీఆర్‌కు ఉన్న పేగుబంధం తెగిపోయిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడం వెనుక కుట్ర ఉందన్నారు రేవంత్. దక్షిణాదిలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.



MIM, ఆప్ తరహాలోనే మూడో పార్టీగా బీఆర్ఎస్‌ను ఉపయోగించుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. గుజరాత్‌ మోడల్‌ను కర్ణాటకలో అమలు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇక సజ్జల వ్యాఖ్యలను కేసీఆర్ ఎందుకు ఖండించలేదన్నారు రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాలను మళ్లీ కలిపే కుట్ర జరుగుతోందన్నారు.

Tags

Next Story