CM : రేవంత్ తగ్గేదేలే! నవంబర్ ఒకటి నుంచే మూసీ పునరుజ్జీవం ఆరంభం
మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని.. నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తొలి దశ టెండర్లపై సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో లంగర్ హౌజ్ బాపూఘాట్ అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో గండిపేట నుంచి లంగర్ హౌజ్ బాపూఘాట్ వరకు పనులు చేపడతామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని బాపూఘాట్‌లో నెలకొల్పుతామన్నారు. మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తాం మన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
బాపూఘాట్ దగ్గరే కేబుల్ బ్రిడ్జి, బ్యారేజ్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. మల్లన్న సాగర్ నుంచి 7వేలకోట్ల రూపాయలతో నీటిని ఉస్మాన్ సాగర్‌కు మళ్లిస్తామన్నారు. అక్కడి నుంచి హిమాయత్ సాగర్‌కు పంపనున్నారు. ట్రంక్‌లైన్ కోసం వచ్చే నెలలో టెండర్లు పిలుస్తారన్నారు. బాపూఘాట్ వద్ద ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేసి మూసీలోకి వదులుతామన్నారు. ఇప్పటికే 140 కోట్ల రూపాయలతో DPR తయారీకి ఆదేశాలిచ్చామని తెలిపారు. నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని సదుపాయాలు కల్పిస్తాం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com