TG : సోలార్ పల్లెగా రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లి

రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శ సౌర విద్యుత్ గ్రామంగా (సోలార్) తీర్చిదిద్దే ప్రక్రియ తొలి అడుగు పడింది. సెప్టెంబర్ 10 దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బి.సంతోష్ రెడ్కో వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ అనిల, సంస్థ డైరెక్టర్ కె.రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు.
గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన అధికార బృందం గ్రామంలో సౌరశక్తిని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఈ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. గ్రామంలో దాదాపు 499 గృహ వినియోగ దారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవ సాయ వినియోగదారులు, ఇతర కేటగిరీలతో కలుపుకుని మొత్తం 1451 మంది వినియోగ దారులు వున్నారని, వీరందరికీ సౌర విద్యుత్ ను అందజేయనున్నట్టు తెలిపారు.
ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలుకు గ్రామంలో ఇంటింటి సర్వే ఈ సర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ మొదలుపెట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. సామర్థ్యాన్ని (కెపాసిటీ) అంచనా వేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయనున్నట్టు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com