CM : కేసీఆర్ ఖతం.. బావ, బామ్మర్దులను ఎలా డీల్ చేయాలో తెలుసన్న రేవంత్

CM : కేసీఆర్ ఖతం.. బావ, బామ్మర్దులను ఎలా డీల్ చేయాలో తెలుసన్న రేవంత్
X

కేటీఆర్ ను ముందు పెట్టి కేసీఆర్‌ బయటకు రాకుండా చేశానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ లో ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. హరీశ్ రావును వాడి బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పని ముగిస్తానని చెప్పారు. కేసీఆర్ ఎక్స్‌పైరీ అయిన మెడిసిన్ అంటూ కామెంట్ చేశారు. కేటీఆర్‌తోనే కేసీఆర్ రాజకీయం ముగుస్తుందనీ.. బావతో బామ్మర్థి రాజకీయం ముగుస్తుందని అన్నారు. బావను ఎలా హేండిల్ చేయాలో తమకు తెలుసుని రేవంత్‌రెడ్డి కామెంట్ చేశారు. పోలీసులను పెట్టి వాళ్లను నిర్బంధించవచ్చన్నారు. కానీ అది తమ విధానం కాదన్నారు. వాళ్లు వెళ్లి ప్రజల ఆలోచనలు తెలుసుకునే అవకాశం క‌ల్పిస్తున్నామని స్పష్టం చేశారు. దీపావళి అంటే మనకు చిచ్చు బుడ్లు వాళ్లకు సారాబుడ్లు అని వ్యాఖ్యానించారు.

Tags

Next Story