Telangana: తెలంగాణలో 8 లక్షల 34వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం.. రేవంత్ రెడ్డి ఆరోపణలు..

Telangana: తెలంగాణలో 8 లక్షల 34వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2వేల 600 కోట్ల విలువైన బియ్యం మాయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వరి వేయని రైతులకు ఎకరాకు 15వేలు, మిల్లర్లకు అమ్ముకున్న రైతులకు 600 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరి రైతులు, జీవో 111, డ్రగ్స్ కేసులు, ఇతర పరిస్థితులపై గవర్నర్‌కు నివేదిక అందించింది కాంగ్రెస్ బృందం.
రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే నాలుగు రోజులు వ్యవసాయ మార్కెట్లను సందర్శిస్తామన్నారు. డబ్బులు ఉన్నప్పుడు రైతుల నుంచి ధాన్యం ముందే ఎందుకు కొనలేదని, అంతమాత్రానికి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారని ప్రశ్నించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com