Revanth Reddy : సర్పంచ్ ఎన్నికల వెనక కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

Revanth Reddy : సర్పంచ్ ఎన్నికల వెనక కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్
X

రేవంత్ ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలకు రెడీ అయిపోయింది. డిసెంబర్ లోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతోంది. అయితే గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ముందు జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావించారు. దానికి తగ్గట్టు ఎలక్షన్ కమిషన్ తో చర్చలు జరిపి షెడ్యూల్ రిలీజ్ చేశారు. కానీ అనుకోకుండా హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో అది ఆగిపోయింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం హైకోర్టులో తీర్పు రావాల్సి ఉంది.

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు పార్టీలతో సంబంధం ఉండదు. అందరు అభ్యర్థులు ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నామని.. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రతిపక్షాలు సహకరించకపోవడం వల్ల ఆగిపోయిందని ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గ్రామపంచాయతీలకు ఎలక్షన్లు కాకపోవటం వల్ల రావట్లేదు. కాబట్టి ముందు గ్రామపంచాయతీలకు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్లు నిర్వహిస్తామని ముందే చెప్పింది.

హైకోర్టు తీర్పు తర్వాత జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలితే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఆ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ సమయానికి గ్రామాల్లో సర్పంచులు అందరూ రెడీగా ఉంటారు. గ్రామాల్లో ఎక్కువమంది కాంగ్రెస్ సర్పంచులు ఉంటే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు బలంగా ప్రచారం చేసుకొని ఎక్కువ సీట్లు గెలవచ్చు. గ్రామాల్లో పట్టు సాధిస్తే ఆటోమేటిక్ గా మండల, జిల్లాస్థాయి కార్పోరేషన్ ఎన్నికలను సునాయాసంగా గెలవచ్చు అన్నది రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే అటు బీసీల ఓటు బ్యాంకును హైకోర్టు తీర్పు చూపించి తమ వైపు తిప్పుకోవాలన్నది ఇంకో ప్లాన్. ఇలా అన్ని రకాలుగా ప్లాన్ రెడీ చేసుకుని ఎక్కువ సీట్లు సాధించడమే రేవంత్ రెడ్డి వ్యూహం. అందుకే సర్పంచ్ ఎన్నికలను ముందుకు తీసుకువచ్చారు.

Tags

Next Story