REVANTH: ఇది ఏపీ కోడి కత్తి ఘటన లాంటిదే

ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసమే నేతలు కుట్రలకు తెరలేపారని తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో కోడికత్తి ఘటన, బెంగాల్ లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటనలు ఇందుకు ఉదాహరణలను అన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అధికార భారాస పార్టీ నేతలు కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలను ఉద్దేశిస్తూ ఈ మేరకు స్పందించారు. అచ్చంపేట బీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై శనివారం రాత్రి జరిగిన దాడి మాటల యుద్ధానికి దారి తీసింది. గాయాలకు చికిత్స తర్వాత అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలరాజుతనపై దాడి కాంగ్రెస్ నేత వంశీకృష్ణ అనుచరుల పనేనని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులతోనే దాడి నుంచి ప్రాణాలతో బయటపడినట్లు తనపై గతంలోనూ వంశీకృష్ణ దాడులు చేయించారని బాలరాజు ఆరోపించారు. తనని ఎదుర్కొనే ధైర్యం లేక... అంతమొందించే కుట్ర చేస్తున్నారని గువ్వల బాలరాజు ఆరోపించారు. తనపై గతంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ దాడులు చేయించారన్న బాలరాజు నిన్న రాత్రి జరిగిన దాడులు సైతం వంశీకృష్ణ చేయించినట్లు ఆరోపించారు.
అయితే గువ్వల బాలారాజుపై దాడి కాంగ్రెస్ నేతల పనేనన్న బీఆర్‌ఎస్ భారాస ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగతోందని ఆరోపించారు. సానుభూతికోసం KTR వ్యూహాలు రచిస్తున్నారన్న రేవంత్ రెడ్డి వరుస దాడి ఘటనల వెనక ప్రశాంత్ కిశోర్ ఉన్నాడని ఆరోపించారు. ఏపీలో కోడికత్తి ఘటన... బంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటనలే.. ఇందుకు సాక్ష్యమని రేవంత్ అన్నారు. మరో 3 కుట్రలు జరుగుతాయని కేటీఆర్ స్పష్టంగా చెప్పారని... ఆ ప్రకటనపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ కుట్రలపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్‌రెడ్డి... తప్పుడు ప్రకటనలపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావుపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని... ఎస్సీ వర్గీకరణ రాహుల్‌గాంధీ ఎప్పుడో మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే కాంగ్రెస్ భేషరతుగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com