TG : రేవంత్ తగ్గేదేలే!.. సెప్టెంబర్ 17పైనా తన మార్క్.. చరిత్రలో తొలిసారి

TG : రేవంత్ తగ్గేదేలే!.. సెప్టెంబర్ 17పైనా తన మార్క్.. చరిత్రలో తొలిసారి
X

సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

సెప్టెంబర్ 17న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది. జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా బీజేపీ భావిస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. మరికొన్ని పార్టీ విలీన దినంగా.. విద్రోహ దినంగా పాటిస్తున్నాయి. ఐతే.. కేసీఆర్ సహా ఏ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తొలిసారి చరిత్రను తిరగరాశారు.

Tags

Next Story