Telanagana News : తెలంగాణలో మళ్లీ ప్రాజెక్టులపై రచ్చ..

తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ నీటి ప్రాజెక్టులపై రచ్చ మొదలైంది. మున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి నది మీద కట్టిన అన్ని ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో కంప్లీట్ చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ బిఆర్ఎస్ హయాంలోనే కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నా సరే.. వదిలేసారని కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రమే పట్టించుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. తాను నీటి వాటాల విషయంలో ఏపీకి సహకరిస్తున్నాను అనే ప్రచారం పూర్తి అబద్దమని.. ఈ విషయాలన్నిటిమీద అసెంబ్లీ వేదికగా చర్చించడానికి సిద్ధమా అంటూ బిఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
అసెంబ్లీ వేదికగా వీటిపై చర్చించేందుకు తాము సిద్ధమని.. మైక్ కట్ చేయకుండా.. కెమెరా తిప్పకుండా తమకు అవకాశం ఇస్తే అన్ని విషయాల మీద క్లారిటీ ఇస్తామని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి సమాధానం చెబుతామని ప్రజలకు నిజానిజాలను వివరిస్తామని సవాల్ చేశారు. మార్చి 16 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఒకరోజు నీటి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు సమయం కేటాయించబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే మళ్ళీ నీటి ప్రాజెక్టులపై రచ్చ మొదలవడం ఖాయం అంటున్నారు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు.
రెండు నెలల క్రితం ఏపీ, తెలంగాణ మధ్య నీటి ప్రాజెక్టులపై, నీటి వాటాలపై ఎంత పెద్ద రచ్చ జరిగిందో మనందరం చూసాం. చివరకు సుప్రీంకోర్టు దాకా ఆ వివాదం వెళ్ళింది. ట్రిబ్యునల్ ముందు వాదనలు కూడా జరిగాయి. ఇప్పుడు ఆ మంటలు చల్లారుతున్న సమయంలో మళ్లీ తెలంగాణలో నీటి వాటాల జగడం మొదలైతే.. అది అసెంబ్లీ వేదిక దాకనే ఆగుతుందా.. అంతకుమించి కొనసాగుతుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఒకవేళ అసెంబ్లీ వేదికగా పెద్ద రచ్చ జరిగి అది కంటిన్యూ అయితే మాత్రం మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య దీని మీద చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
