KCR : కేసీఆర్‌పై రేవంత్ వెటకారం పీక్స్..

KCR : కేసీఆర్‌పై రేవంత్ వెటకారం పీక్స్..
X

కేసీఆర్ చీల్చిచెండాడుతా అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వైరల్ అవుతోంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడ ? చీల్చిచెండాడుతా అన్నారు అందుకే సభకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

“ఎన్నికలైపోయాయి, ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించండి. కేటీఆర్ 100 శాతం ఆర్టిఫీషియల్ జీరో పర్సెంట్ ఇంటిలిజెన్స్" అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు ఓపిక, సహనం ఉండాలని సలహా ఇచ్చారు. సూచనల రూపంలో మోసాన్ని ప్రజల మెదళ్లలో కుక్కే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ విరుచుకుపడ్డారు.

Tags

Next Story