Revanth Reddy : జూబ్లీహిల్స్ రంగంలోకి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం..

కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి తమ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని.. గ్రేటర్ లో తమ పట్టు పెరిగిందని నిరూపించుకోవాలని పట్టు మీద ఉన్నారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సర్వ శక్తులు వడ్డుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఇన్చార్జి మంత్రులను జూబ్లీహిల్స్ లోనే గత నెల నుంచి తిప్పుతున్నారు. ఇక 40 మంది స్టార్ క్యాంపేనర్లు జూబ్లీహిల్స్ లోనే మకాం వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇన్చార్జి మంత్రులతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నాయకులు జూబ్లీహిల్స్ లోని గల్లి గల్లిని చుట్టేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వ్యూహాలు రచిస్తున్నారంట. ఏ డివిజన్ లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు వీక్ గా ఉందో అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారంట. అవసరమైతే ఆ డివిజన్ కు ప్రత్యేక హామీలు ఇవ్వాలని.. కాంగ్రెస్ హయాంలో చేసిన హైదరాబాద్ డెవలప్మెంట్ ను ప్రత్యేకంగా వివరించాలని.. దీనిపై సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోలు పోస్టులు పెట్టారంటూ ఆదేశాలు ఇచ్చారంట. ఈ మేరకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కీలక ఆదేశాలు నిన్న ఇచ్చారు.
బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పుకొట్టాలని.. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు మల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవ్వాల్సిన హామీలపై మంత్రులకు దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లోని ప్రతి ఓటర్ ను కలవాలని.. వారికి అవసరమైన కీలక హామీలు ఇవ్వాలని సూచించారు. నవీన్ యాదవ్ పై బిఆర్ఎస్ చేస్తున్న రకరకాల ప్రచారాలను ఫేక్ ప్రచారం అని ప్రజలకు వివరించాలని చెప్పారు. మరీ ముఖ్యంగా డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, ఫ్లైఓవర్ లు, క్రీస్తు పాటు కాంగ్రెస్ ఇస్తున్న హామీల అమలును వివరించాలని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

