TG : లగచర్ల ఫార్మా ఇండస్ట్రీ రద్దు చేసుకున్న రేవంత్ సర్కార్.. దాని స్థానంలో వచ్చేది ఇదే

TG : లగచర్ల ఫార్మా ఇండస్ట్రీ రద్దు చేసుకున్న రేవంత్ సర్కార్.. దాని స్థానంలో వచ్చేది ఇదే
X

లగచెర్ల భూసేకరణలో తెలంగాణ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది. లగచర్ల ఫార్మా భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. అయితే కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఫార్మా విలేజ్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఫార్మా విలేజ్ ప్రతిపాదనను రద్దు చేసిన ప్రభుత్వం.. కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి.

Tags

Next Story