Kishan Reddy : రేవంత్ కుల రాజకీయాలు మానుకో : కిషన్ రెడ్డి

సీఎం రేవంత్ కుల రాజకీయా లు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. బీసీ సంఘాల డిమాండుకు తాము మద్దతు ఇస్తున్నామని, తామంతా భారత మాత బిడ్డలుగా భావిస్తామని, కాంగ్రెస్ హయాంలోనే మోదీ సామాజికవర్గాన్ని బీసీలలో చేర్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ వ్యతిరేకత కాంగ్రెస్ పైనే ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్'లో తెలంగాణకు ప్రాధా న్యం ఇచ్చిందని తెలిపారు.
రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నల్లగొండలోని పార్టీ జిల్లా కార్యాయలంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 'నిరుద్యోగుల కు జాబ్క్యాలెంబర్పేరుతో ఇచ్చిన హామీని ఇంకా అమలుచేయలేదు. సీఎం ప్రకటనలకే పరిమితం అయ్యారు. కేంద్రం ఇచ్చిన పథకా లను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్ దివాలకోరుతనానికి నిదర్శనం. 11 ఏండ్లలో రెండు పార్టీలు కలిసి 10 లక్షల కోట్లు అప్పు చేశాయి' అని ఆరోపించారు.
బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీలో కొంతమంది అతి తెలివితో మాట్లాడుతున్నారని.. వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. కాగా.. కిషన్ రెడ్డి గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ పై పరోక్షంగా చేసిన ఈ కామెంట్లు.. రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com