CM : బాపూ ఘాట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన విగ్రహాలపై రేవంత్ అధ్యయనం

CM : బాపూ ఘాట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన విగ్రహాలపై రేవంత్ అధ్యయనం
X

దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలున్నాయి.. ఎక్కడెక్కడ గాంధీ ఆశ్రమాలున్నాయి.. ఏయే నమూనాలో ఉన్నాయి.. వెంటనే అధ్యయనం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్ లో ఎలాంటి విగ్రహం పెట్టాలి... మూసీ నదీ తీరంలో ఎంత ఎత్తున నిర్మించే అవకాశముంది. సాధ్యాసాధ్యాలన్నింటినీ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాల్లో పాట్నాలోని గాంధీ మైదాన్ లో ఉన్న గాంధీ విగ్రహమే అత్యంత ఎత్తయింది. దీని ఎత్తు 72 అడుగులు. 2013లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది కాంస్యంతో తయారు చేశారు. ఇద్దరు చిన్నారులతో గాంధీ అప్యాయంగా ఉన్నట్లుగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రపంచంలో వివిధ దేశాల్లోనూ గాంధీ విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి. అమెరికాలోని టెక్సాస్ లోని ఇర్వింగ్లో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహముంది. ఇప్పటివరకు భారతదేశం బయట ఉన్న అతి పెద్ద విగ్రహం ఇదే. గాంధీ దండి మార్చ్ కు నడుస్తున్న భంగిమలో ఈ విగ్రహముంటుంది. శాంతి, సామరస్యానికి ప్రతీకగా ఇది అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ఈ విగ్రహం.

Tags

Next Story