CM Revanth Reddy : కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం రేవంత్ మంతనాలు

CM Revanth Reddy : కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం రేవంత్ మంతనాలు
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం విన్నవించారు. విగ్రహం కోసం లంగర్ హౌజ్ బాపుఘాట్‌లో 222 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్‌ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. వరంగల్, ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టులు నిర్మాణానికి సహకరించాలని కోరారు.

Tags

Next Story