Revanth vs KTR : అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ .. నువ్వు మేనేజ్ మెంట్ కోటా.. నీది పేమెంట్ కోటా

కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కీలకమైన చర్చ జరుగుతుండగా కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘మీకు కేసీఆర్ అవసరం లేదు.. మాకు జవాబు చెప్పండి చాలు’ అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. తండ్రి పేరు చెప్పుకొని నేను మంత్రిని కాలేదని.. కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యానని పేర్కొన్నారు. కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అనుకున్నానని.. అంతకంటే దారుణమని రేవంత్ విమర్శించారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ ‘రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని మేమూ అనొచ్చు’ అని అన్నారు. దీనికి రేవంత్ మళ్లీ కౌంటర్ ఇస్తూ ‘పేమెంట్ కోటాలో సీఎంను కాలేదు. బీఆర్ఎస్ నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చారు’ అని కౌంటర్ ఇచ్చారు. మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రి అయ్యానని ఒక సీఎం అనొచ్చా? సభా నాయకుడు అలా మాట్లాడొచ్చా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలా రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడవడంతో అసెంబ్లీ సమావేశాల్లో పొలిటికల్ హీట్ కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com