Harish Rao : రేవంత్..మాటలే తప్ప చేతల్లేవ్: హరీశ్ రావు

Harish Rao : రేవంత్..మాటలే తప్ప చేతల్లేవ్: హరీశ్ రావు
X

విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి విద్యార్థినిని పరామర్శిం చారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ 'సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలు గా మార్చారు. మేం ప్రశ్నిస్తే వార్డెన్లు, ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీస్కొని చేతులు దులుపుకుంటు న్నరు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నరు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. ప్రచారం కోసం కాదు పిల్లల భవిషత్తు కోసం ఆలోచించండి' అని సూచించారు.

ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి గప్పాలు కొ ట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. డిసెంబర్ 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతు న్న పరిస్థితి ఉందన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ సర్కారు సాధించిన ఘనత ఇదేనన్నారు. విశ్రాంత ఉపాధ్యా యులను, ఉద్యోగులను సైతం ఇబ్బందుల కు గురి చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని.. ఉద్యోగులం దరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోవాలని హితవు పలికారు.

Tags

Next Story