ఉరి తీయాలా.. తెలంగాణ రాజకీయాల్లో ఏంటీ మాటలు..!

తెలంగాణ నేతల మాటలు హద్దులు దాటిపోతున్నాయి. ఇన్ని రోజులు ఒక స్థాయి వరకు విమర్శించుకున్న నేతలు.. ఇప్పుడు చావులు, ఉరులు అంటూ మాట్లాడుతున్నారు. మొన్న మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చి.. తోలు తీస్తా.. ఉతికి ఆరేస్తా అంటూ మాట్లాడారు. దాంతో సీఎం రేవంత్ కూడా ఒకింత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పదేండ్ల పాలనలో తెలంగాణను దోచుకున్నందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఉరి తీసినా తప్పులేదంటూ మాట్లాడుతున్నారు. దానికి కేటీఆర్ కూడా సీరియస్ అయ్యారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన మీరు.. ఇప్పటికీ హామీలను నెరవేర్చనందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటూ సంచలన కామెంట్లు చేశారు. వాస్తవానికి తెలంగాణలో ఇలాంటి మాటలు మంచివి కావంటున్నారు ప్రజలు. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఎంతో ముఖ్యం. అది లేకపోతే ప్రజల్లో చులకన అయిపోతారు.
ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మాట్లాడారో చూశాం. బూతులు తిడుతూ.. దారుణంగా మాట్లాడుతూ అరాచకాలు సృష్టించారు. వాళ్ల భాష వినలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దెబ్బకు జగన్ పార్టీని ప్రజలే మట్టికరిపించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఆ పార్టీని పరిమితం చేసి బుద్ధి చెప్పారు. అయినా సరే ఇప్పటికీ ఆ పార్టీ నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. అందుకే ప్రజల్లో వారికి కనీస మద్దతు కూడా రావట్లేదు. కాబట్టి తెలంగాణలో అలాంటి పరిస్థితికి ఏ పార్టీ చేరుకోవద్దని ఆ పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు.
కాబట్టి బీఆర్ ఎస్ అయినా కాంగ్రెస్ అయినా హుందాగా మాట్లాడుతూ.. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి అని కోరుకుంటున్నారు ప్రజలు. మొన్న అసెంబ్లీలో కేసీఆర్, రేవంత్ కరచాలనం చేయడాన్ని ప్రజలంతా సమర్థించారు. తమకు కావాల్సింది ఇలాంటి హెల్తీ పాలిటిక్స్ అని పదే పదే చెబుతున్నారు. మరి కాంగ్రెస్, బీఆర్ ఎస్ ఆ మేరకు ప్రజల మెప్పు పొందాలని కోరుతున్నారు ఆ పార్టీల కింది స్థాయి కార్యకర్తలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

