Telangana : హద్దులు మీరుతున్న రాజకీయ భాష..

Telangana : హద్దులు మీరుతున్న రాజకీయ భాష..
X

ఈ మధ్య రాజకీయాల్లో హుందాతనం అనేది కనిపించకుండా పోయింది. మరీ ముఖ్యంగా రాజకీయ నేతలు మాట్లాడుతున్న భాష అయితే హద్దులు దాటిపోతుంది. అది క్రేజ్ కోసమో లేదంటే హైపు కోసమో ఇలాంటి భాష మాట్లాడితే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న యువతరం కూడా అలాంటి భాషను నేర్చుకుంటారు కదా. ఇప్పుడు అందరూ ఇదే విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రీసెంట్ గా తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి బూతు భాష ఎక్కువ అయిపోయింది. మొన్న మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తోలు తీస్తా అంటూ రెచ్చిపోయారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇలాంటి భాషనే వాడారు.

ప్యాంటులో తొండలు వేసి కొడతామంటూ ఆయన మాట్లాడిన భాష కూడా హద్దులు మీరి పోయినట్టే ఉంది. ఒక రాష్ట్రానికి అగ్ర నేతలుగా ఉన్న వారి నుంచి ఇలాంటి భాష ఎవరూ ఊహించరు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడితే యూత్ కొంత అట్రాక్ట్ అయ్యారు. కానీ ఆ తర్వాత దాన్నే తెలంగాణ భాషగా.. యాసగా ఆయన ప్రమోట్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ నేతలపై మాట్లాడాలి అంటే ఆయన ఇలాంటి భాషని ఎక్కువగా వాడారు. రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి భాషనే మాట్లాడుతూ ఫేమస్ అయ్యారు.

ఇప్పుడు తాను సీఎం అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఇలాంటి భాషని ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి భాష నిజంగా అస్సలు మంచిది కాదు. ఎందుకంటే రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ఇలాంటి అభ్యంతరకరమైన పదాలు వాడుతూ తమ స్థాయిని కూడా పక్కన పెట్టడం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకప్పుడు ఇలాంటి భాషకు ఆదరణ దక్కింది కానీ ఇప్పుడు దాన్ని ఎవరూ సహించట్లేదు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా కొందరు మంత్రులు ఇతర నాయకులు ఇలాగే మాట్లాడి ప్రజల ముందు పరువు తీసుకున్నారు. వాళ్ల భాష చివరకు వైసీపీని దారుణంగా ఓడించింది. కాబట్టి తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి భాషను మాట్లాడకపోతే బెటర్.

Tags

Next Story