హైదరాబాద్‌లో కారు బీభత్సం.. ఆటో, ద్విచక్రవాహనాలు నుజ్జునుజ్జు

X
By - Nagesh Swarna |4 Sept 2020 7:43 PM IST
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మియాపూర్ నుండి అమీర్‌పేట్ వైపు అతి వేగంగా వెళ్తున్న ఓ కారు KPHB ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. అయినా కారు కంట్రోల్ కాకపోవడంతో కంగారుపడ్డ డ్రైవర్ మరింత వేగంగా నడిపి ముందు వెళ్తున్న కారును, ఆటోను, మరో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో, ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com