ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు

X
ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడడంతో.. ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుల్ని ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. విషమంగా ఉన్న క్షతగాత్రుల్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. ఒకే వాహనంలో 35 మందిని తరలిస్తున్న యజమానిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు అటువంటి వాహనాల్లో ప్రయాణించవద్దని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
