నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!

బంధువుల ఇంట్లో అన్నప్రాసననకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో జరిగింది. పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామ సర్పంచ్ తరి శ్రీనివాస్‌తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. హాలియా వైపు వెళ్తున్న బియ్యం లారీ.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది.
సుమారు 50 అడుగుల దూరం లాక్కెళ్లి డివైడర్‌ను దాటింది. అదే సమయంలో అత్తగారింట్లో అన్నప్రాసనకు బైక్‌పై భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్తున్న తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనివాస్ బైక్.. ప్రమాదవశాత్తూ లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య విజయ అక్కడికక్కడే మృతి చెందారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ కుమారుడు, కుమార్తె చనిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com