ప్రేమజంటను విడదీసిన ప్రమాదం.. పెళ్లి చేసుకునేందుకు వెళ్తుండగా ..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఈ కారు ఒక్కసారిగా అదుపు తప్పి బైక్‌లను ఢీకొట్టి విధ్వంసం సృష్టించింది. అప్పటికే సిగ్నల్ పడి ఉండటంతో.... వాహనాలన్నీ ఆగి ఉన్నాయి. కారు ఒక్కసారిగా.... వేగంగా దూసుకెళ్లి స్కూటీతో పాటు ఇతర బైక్‌లను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదం ఓ ప్రేమజంటను విడదీసింది. కారు ఢీకొనడంతో.... పెట్రోలు లీకై స్కూటీ దగ్ధమైంది. ప్రేమపెళ్లి చేసుకునేందుకు ఇదే స్కూటీపై వెళ్తున్న నాగరాజు, శ్రీలత తీవ్రంగా గాయపడ్డారు. నాగరాజును ఆసుపత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యలోనే చనిపోయాడు. శ్రీలత తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com