Telangana : గ్రీన్‌కో నుంచి బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టింది. రేసు నిర్వహించిన గ్రీన్‌కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ కు రూ.కోట్ల లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఆ కంపెనీ బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.41 కోట్లు చెల్లించిందని తెలిపింది. 2022 ఏప్రిల్ 8-అక్టోబర్ 10 మధ్య గ్రీన్‌కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నట్లు సర్కార్ పేర్కొంది.
అయితే గ్రీన్‌కో సంస్థ ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు చెల్లించిందని ప్రభుత్వం వెల్లడించడంపై కేటీఆర్ స్పందించారు. ‘2023లో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ జరిగింది. గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు 2022లో ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ బాండ్లను కూడా ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ-కార్ రేసు కారణంగా గ్రీన్‌కో నష్టపోయింది. పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com