Bandi Sanjay : రూ. 8 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించండి.. బండి సంజయ్ లేఖ

Bandi Sanjay : రూ. 8 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించండి.. బండి సంజయ్ లేఖ
X

తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కేంద్రమం త్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ‘ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయి. కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి' అని బండి సంజయ్ అన్నారు. మరోవైపు మంత్రి పొన్నం చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హుస్నాబాద్, సిరిసిల్ల జిల్లాలో సైనిక్ స్కూల్ కోసం.. గత నెల 15న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశానని చెప్పారు. 'రాష్ట్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం.. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే నా విజ్ఞప్తికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ఈ వ్యవహారంపై రాజకీయం చేయడం సరికాదు. ఇక్కడ రాజకీయ పార్టీల వైఖరిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒక్కటిగా ఉండాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమతో కలిసి రావాలని కోరుతున్న' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

Tags

Next Story