TG : ఆర్ఎస్ ప్రవీణ్..ఫస్ట్ ఫామ్ హౌస్ బాట పట్టాలి : ఎమ్మెల్యే కవ్వంపల్లి

TG : ఆర్ఎస్ ప్రవీణ్..ఫస్ట్ ఫామ్ హౌస్ బాట పట్టాలి : ఎమ్మెల్యే కవ్వంపల్లి
X

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేనీ కోసం గురుకులాలకు పోతుండో ప్రజలకు చెప్పాలని, ముందు ఆర్ఎస్ ఫామ్ హౌస్బట పట్టి కేసీఆర్ను బయటకు తీసుకురావాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ అన్నారు. ఇవాళ గాంధీభవన్లో ఆయన ప్రెస్మీట్ మాట్లాడారు.. గురుకుల వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గురుకులాల అభివృద్ధిని ధ్వంసం చేయడానికి మాత్రమే ప్రవీణ్ కుమార్ గురుకులాలకు పోతుండని తెలిపారు. ' ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులకు భవనాలకు కేటాయించి పెద్ద మొత్తంలో స్కాం చేసిండు. ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగిన స్కాంలపై విచారణ జరపాలని సీఎంను కోరుతున్న.. త్వరలోనే స్కాంలను బయటపెడ్తాం. గురుకుల స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉంది. విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలి. అందరూ ఒకే దగ్గర చదువుకోవా లని కాంగ్రెస్ గురుకులాలు తేస్తే.. బీఆర్ఎస్ కులాల మధ్య చిచ్చు పెట్టింది. నువ్వు సక్రమం గా గురుకులాలను నడిపితే ఇన్ని ఇబ్బందులు వచ్చివి కావు. బీఆర్ఎస్ హయంలో గురుకు లాల ఇన్ఫ్రాస్టక్టర్ పేరుతో వందల కోట్ల అవినితీ జరిగింది. ' అని కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

Tags

Next Story