Telangana : రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు

Telangana : రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు
X

తెలంగాణకు సెంట్రల్ రోడ్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ’34 రోడ్డు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయాభివృద్ధిపై కేంద్రం నిబద్ధతతో ఉంది’ అని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరు కావడం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో వాణిజ్య, వ్యవసాయ రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త రహదారుల నిర్మాణం వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, సురక్షితమైన ప్రయాణానికి వీలు కలుగుతుంది. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

Tags

Next Story