TGRTC : గద్దెల దాకా బస్సులు.. నడక తప్పిస్తున్న ఆర్టీసీ

TGRTC : గద్దెల దాకా బస్సులు.. నడక తప్పిస్తున్న ఆర్టీసీ
X

మేడారం మినీ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సేవలను అందిస్తోంది అంటున్నారు అధికారులు. హనుమకొండతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తుల రద్దీని బట్టి ఆయా డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులను గద్దెల ముందువరకు తీసుకొస్తుండటంతో నడకబాధ తప్పినట్లయింది. ఎవరైనా జంపన్నవాగుకు వెళ్లి రావాలనుకునేవారు గద్దెల వద్దకు రావడానికి ముందే వాగు వద్ద దిగి తలస్నానాలు చేసి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలకు ఉచితప్రయాణం కల్పించడంతో తల్లుల దర్శనానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Tags

Next Story