TGSRTC : ప్రైవేటు సాయంతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ లగ్జరీ బస్సులు

తెలంగాణ ఆర్టీసీ త్వరలో ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురాన్నుట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను తొలుత కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్- హైదరాబాద్ మార్గాలలో నడపాలని ఆర్టీసీ నిర్ణయించిందని తెలిపారు. ఈ-సూపర్ లగ్జరీ పేరుతో తీసుకు రానున్న ఈ బస్సులు ఇప్పటికే కరీంనగర్ డిపోకు 35, నిజామాబాద్ డిపోకు 13 చేరుకున్నాయని తెలిపారు.
ఈ బస్సులను ఆర్టీసీ ప్రైవేట్ సంస్థ నుండి అద్దెకు తీసుకుంటున్నామని, ఇప్పటికే హైదరాబాద్ లో సిటీ బస్సులుగా, హైదరాబాద్-విజయవాడ మధ్య అంతరాష్ట్ర సర్వీసులుగా నడిపిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు కాగా ప్రస్తుతం సూపర్ లగ్జరీ బస్సులను నడిపించనున్నామన్నారు.
త్వరలోనే ఈ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ బస్సుల్లో డ్రైవర్లుగా బస్సు యజమాని సిబ్బందే ఉంటారని, కండక్టర్లుగా మాత్రం ఆర్టీసీ సిబ్బంది ఉంటారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com