Former Minister Sabitha : సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థత

Former Minister Sabitha : సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థత
X

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన మీటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేశాక ఆమె అస్వస్థతకు గురయ్యారు. సబిత జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆమెకు చికిత్స చేసిన తర్వాత పరిశీలనలో ఉంచారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె హైదరాబాద్ కు పయనమయ్యారు. సబిత ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

Tags

Next Story