TG : జాతీయ రహదారిగా సమ్మక్క, సారలమ్మ కారిడార్

ములుగు జిల్లాలోని 163వ జాతీయ రహదారిని సమ్మక్క, సారలమ్మ కారిడార్ గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. వివిధ ప్రాంతాలల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేయడంతో పాటు జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, చారిత్రాత్మక ప్రదేశాల గురించి వచ్చే పర్యాటకులకు, భక్తులు తెలిసేవిధంగా చిహ్నాలను, థీమ్లను ఏర్పాటుచేయాలని సూచించారు.
జిల్లాకు వచ్చే పర్యాటకులు ఎక్కువగా ప్లాస్టిక్ ను వినియోగించుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటుచేసి ప్లాస్టిక్ జిల్లాగా ఏర్పాటుచేస్తామన్నారు సీతక్క. జాతరకు వచ్చే రహదారులు ఎత్తు లేకుండా సమాంతరం చేస్తూ రోడ్డును విస్తరింపజేస్తామన్నారు. వీఐపీ మార్గం కూడా శాశ్వత అభివృద్ధితో నిర్మాణం జరుగుతుందని, కాల్వపల్లి, ఊరట్టం గ్రామాల నుంచి వచ్చే రహదారిని పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 15 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు సీతక్క తెలిపారు.
గద్దెల ప్రాంగణం నుంచి జంపన్నవాగు వరకు సీసీరోడ్డు నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తామన్నారు సీతక్క.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com