TG : తెలంగాణలో మండుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

TG : తెలంగాణలో మండుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
X

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రో జురోజుకూ పెరుగుతున్న భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడు తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలు కీలకసూచనలు చేసింది. రానున్న మూడు రోజులు పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గురు, శుక్ర వారాల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలుస్తోం ది. గాలిలో తగ్గుతున్న తేమ, వేడి గాలుల వలన ఉక్కపోతతోపాటు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు టెంపరేచర్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పగ టిపూట ఎండలు, సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలకు ఎక్కువగా ఛాన్స్ ఉందని అంచనా వేస్తుంది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్, మంచి ర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖా తంలో ఉత్తర, దక్షిణ ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంలో ఈదురుగా లులు, ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనావేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, జనగాం, సూ ర్యాపేట, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వానలు పడతాయని రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో వాతావరణం మునుపటి కంటే భిన్నంగా ఉంది. ఎండలు, వానలు ఒకేసారి సంభవిస్తున్నాయి. దీంతో తెలంగాణలో డిఫరెంట్ వెదర్ ఉంది. మధ్యాహ్నం భగ్గుమంటు న్న ఎండలు, సాయంత్రం నుంచి వానలతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Tags

Next Story