TG : పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం?

X
By - Manikanta |1 Feb 2025 2:15 PM IST
పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తమ పనులు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో వీరు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా టాప్-5లో ఉన్న ఓ మంత్రి వైఖరిపై వారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గాంధీభవన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు సీఎం రేవంత్ కాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలతో పాటు ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారులెవరూ ఈ మీటింగ్‌కు రావొద్దని ఆదేశించినట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com