TG Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారో చూడండి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరిరోజు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం సభ అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలపగా స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 11వ రోజు గురు వారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభా పతి ప్రసాద్ కుమార్ ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. చివరిరోజు మూడు బిల్లులపై చర్చ జరిగింది. ది తెలంగాణ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్ 2025 ను సభలో ప్రవేశపెట్టి, చర్చించి.. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఆమోదం కోరారు.
డిప్యూటీ సీఎం బట్టి ద్రవ్య వినిమయ బిల్లు 2025 ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందారు. అనంతరం శాసనసభ, శాసన మండలిలో కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టారు. అనంతరం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. పార్టీల వారీగా శాసనసభలో 65 గంటలను కాంగ్రెస్ వినియోగించుకోగా, 38 గంటలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, 8 గంటలు బీజేపీ, 7 గంటలు ఎంఐఎం, ఒక గంట కమ్యూనిస్టు పార్టీలు వినియోగించుకున్నాయి. ఈ నెల 12న గవర్నర్ ప్రసంగంతో మొదలైన బడ్జెట్ సమావేశాలు గురువారం వరకు కొనసాగాయి. 11 రోజుల సమావేశాల్లో 97 గంటల 32 నిమిషాలు చర్చ జరిగింది. ఇందులో 16 స్టార్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా, సభలో మరో 27 సమాధానాలను టేబుల్ చేశారు. అస్టార్ ప్రశ్నలు 79 ఉండగా, వాటికి సమాధానాలను శాసనసభ టేబుల్ చేసింది. 22 సప్లిమెంటరీలను సభ్యులు చేపట్టగా, 146 మంది సభ్యులు సభలో మాట్లాడారు. ఈ సమావేశాలలో 3 తీర్మానాలకు ఆమోదం దక్కగా, 12 బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమో దించారు. సభను సజావుగా నడిపేందుకు సహకరించిన అందరికీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com