Nalgonda Collector : నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం

Nalgonda Collector : నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం
X

నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 100 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును బ్రేక్ చేశారు. అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో ఈ డెసిషనీ సుకున్నారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.

ఇంటి పన్నులు సొంతానికి వాడుకుండ్రు 100 మంది పంచాయతీ కార్యదర్శులు ఆరు నెలల పాటు చెప్పకుండా విధులకు గైర్హాజరు కావడంపై వివరణ ఇవ్వాలంటూ జిల్లా కలెక్ట ర్ నోటీసులు ఇచ్చారు. కొంతమంది అనారో గ్యం పేరుతో విధులకు గైర్హాజరు అయి కూడా జీతాలు తీసుకున్నట్లు విచారణలో బట్టబయ లైంది. కొందరు వాళ్ల పోస్టింగ్ కోసం జిల్లా పాలనాధికారి మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. టీఎన్జీవో సంఘం డీపీఓ ఆఫీస్ ను గుప్పిట్లో పెట్టుకుని పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలొ చ్చాయి. పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం చేయడం మానేసి.. రాజకీయాలు ఎక్కువ చేస్తు న్నారని కలెక్టర్ ఫైర్అయ్యారు. ఇంటి పన్నులు వసూలు చేసి చలాన్ కట్టకుండా కార్యదర్శు లు సొంతానికి వాడుకున్నారని ఫిర్యాదులు అందాయి. డబుల్ రశీదు పుస్తకాలు మెయిం టెనెన్స్ గురించి అడిగే వారు ఎవరూ లేకపోవ డంతో ఆన్లైన్లో తక్కువ చూపించి ఆఫ్ లైన్ లో ఎక్కువ వసూలు చేసి అధికారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై విచారణ కొనసాగు తోంది. కలెక్టర్ అనుమతి లేకుండా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఎంబీ (మెజర్మెంట్ బుక్) రికార్డ్ చేశారని ఆరోపణలున్నాయి.

Tags

Next Story